Saif Ali Khan Attack Case: సైఫ్ పై దాడి కేసు: వేలిముద్రల ఫైనల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్న పోలీసులు

Police awaits final report of finger prints in Saif Ali Khan attack case

  • ఇటీవల సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి
  • నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • వేలిముద్రలు మ్యాచ్ కాలేందంటూ కొన్ని కథనాలు
  • ప్రాథమికంగా వేలిముద్రలు సరిపోలినట్టు తాజా రిపోర్ట్ 

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ముంబయి పోలీసులు ఇప్పటికే ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేయడం తెలిసిందే. బంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లామ్ షేజాద్ అనే వ్యక్తిని థానేలో అదుపులోకి తీసుకున్నారు. అయితే, సైఫ్ ఇంట్లో లభ్యమైన వేలిముద్రలతో, అరెస్టయిన వ్యక్తి వేలిముద్రలు సరిపోలడంలేదంటూ కొన్ని కథనాలు వచ్చాయి. 

అయితే ఈ కథనాల్లో వాస్తవం లేదని తాజాగా వెల్లడైంది. ప్రాథమికంగా అతడి వేలిముద్రలతో సైఫ్ ఇంట్లో సేకరించిన వేలిముద్రలు సరిపోలాయని గుర్తించారు. అయితే,  పోలీసులు పూర్తిస్థాయి వేలిముద్రల నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అంశాన్ని ముంబయి 9వ జోన్ డీసీపీ దీక్షిత్ నిర్ధారించారు. తాము వేలిముద్రలకు సంబంధించిన ఫైనల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ముంబయి జేసీపీ (లా అండ్ ఆర్డర్) సత్యనారాయణ్ చౌదరి స్పందిస్తూ... ఈ కేసులో ఆధారాలు ఉన్నందునే షరీఫుల్ ఇస్లామ్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. 

అటు, బాంద్రా కోర్టు షరీఫుల్ కు జనవరి 29 వరకు కస్టడీ పొడిగించింది. నిందితుడిని సైఫ్ అలీ ఖాన్ ముందుకు తీసుకురానున్నారు. సైఫ్ అతడ్ని గుర్తించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News