బ్రిటిష్ కాలం కథతో విజయ్ దేవరకొండ!
- రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్
- యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా సినిమా
- ఈ సినిమా కోసం నిర్మిస్తున్న ప్రత్యేక సెట్
వేసవిలో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో పాటు 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. బ్రిటీష్ కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందట. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఏ సినిమాలో చూపించని అంశాలతో ఈ సినిమా ఉంటుందని చెబుతోంది చిత్ర యూనిట్.
కాగా ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేక సెట్‌ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన సెట్ వర్క్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీడీ 14 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందబోతోంది.