At Home: రాజ్ భవన్ లో ఎట్ హోం... హాజరైన చంద్రబాబు, పవన్, లోకేశ్... ఫొటోలు ఇవిగో!

Chandrababu and Pawan Kalyan attends At Home in Raj Bhavan

  • రిపబ్లిక్ డే వేడుకల అనంతరం విజయవాడలో ఎట్ హోం కార్యక్రమం
  • హాజరైన కూటమి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు
  • అతిథులకు అల్పాహార విందు ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్

ఇవాళ రిపబ్లిక్ డే వేడుకలు ముగిసిన అనంతరం, విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు, ఏపీ హైకోర్టు సీజే, జడ్జిలు, సీఎస్, డీజీపీ, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. 

ఎట్ హోం సందర్భంగా గవర్నర్... అతిథులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది.

  • Loading...

More Telugu News