Chandrababu: ప్రధాని మోదీకి కూడా మన శకటం నచ్చింది: సీఎం చంద్రబాబు

- ఢిల్లీలో వేడుకగా రిపబ్లిక్ డే
- ఏపీ నుంచి ఏటికొప్పాక బొమ్మలతో కూడిన శకటం ప్రదర్శన
- మోదీ సహా ప్రముఖలందరూ మన శకటం పట్ల ఆసక్తిచూపారన్న చంద్రబాబు
దేశ రాజధాని ఢిల్లీలో నేటి రిపబ్లిక్ డే వేడుకల్లో అందమైన ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి కూడా మన శకటం నచ్చిందని అన్నారు. ఇతర ప్రముఖులు కూడా ఏపీ శకటం పట్ల ఆసక్తి ప్రదర్శించారని తెలిపారు. ఏటికొప్పాక బొమ్మలు కళాకారుల సృజనాత్మకతకు మారుపేరు అని చంద్రబాబు అభివర్ణించారు. ఏపీ శకటం రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
