Manchu Vishnu: దేశం కోసం త్యాగాలు చేసే త్రివిధ దళాల కుటుంబాల కోసం ముందడుగు వేసిన విష్ణు మంచు

Manchu Vishnu announces Scholorships for families of defence forces

  • త్రివిధ దళాల్లో పనిచేస్తున్న తెలుగువారి పిల్లలకు స్కాలర్ షిప్ లు
  • తమ సంస్థల్లోని కోర్సులకు 50 శాతం స్కాలర్ షిప్ లు
  • సైనికుల త్యాగాలకు గౌరవసూచకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్న విష్ణు

మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్, టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ప్రకటించారు. 

త్రివిధ దళాలలో పని చేస్తున్న తెలుగు వారిని గౌరవిస్తూ, వారి పిల్లలకు తమ విద్యాసంస్థలో 50 శాతం స్కాలర్‌షిప్‌ను అందించబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని తెలుగు కుటుంబాలకు వర్తించనుంది. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అందించే అన్ని కోర్సులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు.

ఈ మేరకు మంచు విష్ణు మాట్లాడుతూ... “మన దేశాన్ని రక్షించడానికి సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి సేవలకు గౌరవ సూచకంగా, వారికి కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. దేశానికి నిస్వార్థంగా సేవ చేసే వారి సంక్షేమానికి తోడ్పడాలని నిర్ణయించుకున్నాను. ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థలకు మా నిర్ణయం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.

సమాజానికి తిరిగి అందించాలనే లక్ష్యంతో మంచు విష్ణు ఈ మహత్కర కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇదే కాకుండా తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను విష్ణు దత్తత తీసుకున్నారు. వారందరికీ మెరుగైన విద్య, వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లను చేశారు. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ఇలా సైనికుల పిల్లలకు 50 శాతం స్కాలర్ షిప్‌ను ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

  • Loading...

More Telugu News