Venkatesh: బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రికార్డు సృష్టిస్తున్న వెంకటేశ్ కొత్త సినిమా

Sankranthiki Vasthunam Record Collections

  • ఇప్పటి వరకు రూ.260 కోట్లు రాబట్టిన ‘సంక్రాంతికి వస్తున్నాం’
  • ఓవర్సీస్ వసూళ్లలో వెంకటేశ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డు
  • 3 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందంటున్న నిర్మాణ సంస్థ

విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.260 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే రూ.300 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ఈ సినిమా నిర్మాణ సంస్థ పేర్కొంది. విడుదలైన నాటి నుంచి థియేటర్‌లో హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయని చెప్పింది.

గడిచిన 24 గంటల్లో బుక్ మై షోలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు 1.70 లక్షల టికెట్లు బుక్ అయ్యాయని తెలిపింది. కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఆంధ్ర, సీడెడ్‌, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

ఓవర్సీస్ వసూళ్లలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డులు కొల్లగొడుతోందని చిత్ర బృందం తెలిపింది. వెంకటేశ్ కెరీర్ లోనే అత్యధిక ఓవర్సీస్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిందని పేర్కొంది. ఇప్పటి వరకు నార్త్‌ అమెరికాలో 2.6 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. తొందర్లోనే 3 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సినిమాను సూపర్ హిట్ చేసిన అభిమానులకు నటీనటుల బృందం ధన్యవాదాలు తెలిపింది. ప్రముఖ నగరాల్లో సక్సెస్‌ మీట్‌లను నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News