Director Shafi: గుండెపోటుతో సినీ డైరెక్టర్ మృతి.. ఇండస్ట్రీలో విషాదం

Malayalam Director Shafi Dies Of Heart Attack

--


మలయాళ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఆసుపత్రిపాలైన ప్రముఖ దర్శకుడు షఫీ (56) ఆదివారం కన్నుమూశారు. ఈ నెల 16న షఫీకి గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న షఫీ తాజాగా తుదిశ్వాస వదిలారని వైద్యులు తెలిపారు. 

వన్ మ్యాన్ షోతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన షఫీ.. దాదాపు 50 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. కళ్యాణరామన్, పులివల్ కళ్యాణం, తొమ్మనమ్ ముక్కలుల్, టూ కంట్రీస్, చిల్డ్రన్ పార్క్, షెర్‌లాక్ టోమ్స్ తదితర సినిమాలు తీశారు. దర్శకుడిగా షఫీ చివరి సినిమా ఆనందం పరమానందం 2022లో థియేటర్లలో విడుదలైంది.

  • Loading...

More Telugu News