AR Rahman: రామ్ చరణ్ సినిమా నుంచి ఏఆర్ రహ్మాన్ తొలగింపు వార్తలు హల్‌చల్.. స్పష్టత ఇచ్చిన మేకర్స్

AR Rehman out from RC16 is the FAKE NEWS

  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ 
  • పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రహ్మాన్
  • ఆయనను తప్పించి దేవిశ్రీప్రసాద్‌ను తీసుకున్నట్టు పుకార్లు
  • వాటిని ఫేక్ న్యూస్‌గా కొట్టిపడేసిన నిర్మాణ సంస్థ

టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా ఆర్‌సీ 16 నుంచి  ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్‌ను తప్పించినట్టు వస్తున్న వార్తలపై నిర్మాణ సంస్థ స్పందించింది. అదంతా తప్పుడు ప్రచారమని, అందులో ఎలాంటి నిజం లేదని సంస్థ అధికారిక పీఆర్ స్పష్టం చేసింది. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పింది. ఆయన తమతోనే ఉన్నారని తెలిపింది.
గేమ్ చేంజర్ సినిమా తర్వాత మరో పెద్ద ప్రాజెక్టులో రామ్ చరణ్ నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రేపటి నుంచి తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.  

కాగా, ఈ సినిమాలో తొలుత ఏఆర్ రహ్మాన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారని, అయితే, ఆ తర్వాత ఆయనను తప్పించి దేవిశ్రీ ప్రసాద్‌ను తీసుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆర్‌సీ 16 అధికారిక పీఆర్ ఈ వార్తలను ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. కాగా, ఈ సినిమాలో పలువురు బిగ్ స్టార్లు నటిస్తున్నారు. జగపతిబాబు, శివకుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ సమర్పిస్తోంది.  

  • Loading...

More Telugu News