Republic Day: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

- ఈ వేడుక మన రాజ్యాంగ విలువలను కాపాడుతుందన్న ప్రధాని మోదీ
- ప్రజాస్వామ్యం, గౌరవంతో పాటు ఐక్యతగా దేశ అభివృద్ధి ప్రయాణం సాగేలా కృషి చేసిన మహనీయులందరికీ నివాళులర్పిస్తున్నానన్న మోదీ
- అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిర్మించడంలో ప్రధాని మోదీకి సహకరిస్తానని ప్రతిజ్ఞ చేద్దామన్న అమిత్ షా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజాస్వామ్యం, గౌరవంతో పాటు ఐక్యతగా దేశ అభివృద్ధి ప్రయాణం సాగేలా కృషి చేసిన మహనీయులందరికీ ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుక మన రాజ్యాంగ విలువలను కాపాడుతుందన్నారు. బలమైన సంపన్నమైన దేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మోదీ ట్వీట్ చేశారు.
దేశ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే అనేది భారత రాజ్యాంగ విలువలపై విశ్వాసం, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్యంపై అంకితభావానికి చిహ్నమన్నారు. బలమైన గణతంత్రానికి పునాది వేసిన స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ 76వ గణతంత్ర దినోత్సవం నాడు అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిర్మించడంలో ప్రధాని మోదీకి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు.