Hyderabad: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే, రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాలు
- ఉదయం పరేడ్ మైదానంలో ట్రాఫిక్ ఆంక్షలు
- సాయంత్రం రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే, రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. జనవరి 26న ఉదయం ఏడున్నర గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు పరేడ్ మైదానం పరిసరాల్లో, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట, సికింద్రాబాద్ పరేడ్ మైదానం మార్గంలో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పరేడ్ మైదానం పరిసర ప్రాంతాలైన టివోల్ క్రాస్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాలను మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు కాస్త ముందుగా బయలుదేరి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని పోలీసులు సూచించారు.