India vs England: రెండో టీ20.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..!

- చెన్నై వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20
- నిర్ణీత 20 ఓవరల్లో 165 పరుగులు చేసిన ఇంగ్లీష్ జట్టు
- భారత్ ముందు 166 పరుగుల లక్ష్యం
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. భారత్‌కు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ 45, బ్రైడాన్ కార్స్ 31, జేమీ స్మిత్ 22 రన్స్‌తో రాణించారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా... అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. ఇక ఐదు మ్యాచుల సిరీస్ లో భాగంగా టీమిండియా ఇప్పటికే తొలి టీ20లో గెలిచి 1-0తో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.