Draupadi Murmu: ఈ రిపబ్లిక్ డే మనకు మరింత ప్రత్యేకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
- రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతుందన్న ద్రౌపది ముర్ము
- ఇది దేశం మొత్తం గర్వించదగ్గ సందర్భమని వ్యాఖ్య
- భారత్ అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా ఎదగడం గర్వకారణమన్న రాష్ట్రపతి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రిపబ్లిక్ డే మనకు మరింత ప్రత్యేకమని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతుందని, ఇది దేశం మొత్తం గర్వించదగ్గ సందర్భమని రాష్ట్రపతి పేర్కొన్నారు.
భరతమాత విముక్తి కోసం త్యాగం చేసిన వారిని స్మరించుకోవాలన్నారు. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకున్నామని, వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను మార్చుకున్నామని, ఈ ఏడాది కొత్త చట్టాలను రూపొందించి అమల్లోకి తెచ్చామని రాష్ట్రపతి తెలిపారు. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతుందన్నారు. ఇక భారత్ అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా ఎదగడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.