Arshdeep Singh: ఐసీసీ టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌

Arshdeep Singh Named ICC Mens T20I Cricketer of The Year 2024

  • 2024 ఏడాదికి గాను ఐసీసీ టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా అర్ష్‌దీప్
  • అవార్డు కోసం అర్ష్‌దీప్‌తో పోటీప‌డ్డ‌ హెడ్, బాబ‌ర్ ఆజ‌మ్, సికింద‌ర్ ర‌జా
  • 2024లో 18 మ్యాచులు ఆడి 36 వికెట్లు ప‌డ‌గొట్టిన పేస‌ర్ 
  • గ‌తేడాది టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెల‌వ‌డంలోనూ కీరోల్‌

టీమిండియా స్టార్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ 2024 ఏడాదికి గాను ఐసీసీ టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ఎంపిక‌య్యాడు. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), బాబ‌ర్ ఆజ‌మ్ (పాకిస్థాన్‌), సికింద‌ర్ ర‌జా (జింబాబ్వే) ల‌తో పోటీప‌డి మ‌రీ అర్ష్‌దీప్ ఈ అవార్డు ద‌క్కించుకున్నాడు. 

ఇక గ‌తేడాది అర్ష్‌దీప్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. 2024లో 18 మ్యాచులు ఆడిన ఈ పేస‌ర్ ఏకంగా 36 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో గ‌తేడాది టీమిండియా త‌ర‌ఫున టీ20ల్లో టాప్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు.   అలాగే గ‌తేడాది జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ను భార‌త్‌ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 8 మ్యాచుల్లో 7.16 ఎకాన‌మీతో 17 వికెట్లు తీశాడు. 

ఇక భార‌త్ త‌ర‌ఫున పొట్టి ఫార్మాట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ కూడా అర్ష్‌దీపే కావ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు ఈ ఫార్మాట్‌లో 97 వికెట్లు తీశాడు. మ‌రో మూడు వికెట్లు సాధిస్తే.. టీమిండియా త‌ర‌ఫున టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌల‌ర్‌గా రికార్డులకెక్కుతాడు.   

  • Loading...

More Telugu News