Pune: పూణేలో ఘోర ప్రమాదం.. కాంక్రీట్ లారీ కిందపడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు మృతి!

మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పూణేలో అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా పడడంతో దాని కిందపడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మూడు రోడ్ల సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న కాంక్రీట్ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే స్కూటీపై వెళ్తున్న వారిపై అమాంతంగా పడిపోయింది. దాంతో ఆ కాంక్రీట్ లారీ కింద పడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు నుజ్జు నుజ్జయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.