Chandrababu: విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు రియాక్షన్

- పార్టీపై నమ్మకం లేకపోతే ఎవరైనా వెళ్లిపోతారన్న చంద్రబాబు
- పార్టీ పరిస్థితి కూడా ముఖ్యమని వ్యాఖ్య
- ఇది వైసీపీ వ్యక్తిగత అంశమన్న సీఎం
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి స్పందించారు. దావోస్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు ఈరోజు చంద్రబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రాజీనామా అంశాన్ని మీడియా ప్రతినిధులు లేవనెత్తగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎవరికైనా నమ్మకం ఉంటేనే పార్టీలో ఉంటారని... లేకపోతే వెళ్లిపోతారని చంద్రబాబు అన్నారు. పార్టీ పరిస్థితి కూడా చాలా ముఖ్యమని అన్నారు. ఇది వైసీపీ వ్యక్తిగత అంశమని చెప్పారు. వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేసిన పరిస్థితి ఏపీలో తప్ప దేశంలో మరెక్కడా లేదని అన్నారు. రాజకీయాల్లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తులు వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.