Vijayasai Reddy: జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని నాపై ఒత్తిడి చేశారు: విజయసాయి రెడ్డి

Kutami govt will get benefit with my resignation says Vijayasai Reddy

  • కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనపై కేసు నమోదు చేశారన్న విజయసాయి
  • లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారని వెల్లడి
  • తన రాజీనామాతో కూటమికే లాభమని వ్యాఖ్య

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ అధినేత జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని తనపై ఎంతోమంది ఒత్తిడి చేశారని విజయసాయి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. తనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కేవీ రావుతో తనకు సంబంధాలు లేవని చెప్పారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు తాను పంపించలేదని అన్నారు. సీఐడీ తనను విచారణకు పిలవలేదని తెలిపారు.

తన రాజీనామాతో కూటమికే లాభమని చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే తాను బలహీనుడిగా మారుతానని... అలాంటప్పుడు రాజీనామా చేస్తే తనను కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారని ప్రశ్నించారు. న్యూస్ ఛానల్ పెట్టే అంశంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. బెంగళూరు, విజయవాడలో ఒక్కొక్క ఇల్లు, వైజాగ్ లో ఒక అపార్ట్ మెంట్... ఇవే తన ఆస్తులని తెలిపారు. బీజేపీ ఎంపీ పదవి గురించి కానీ, గవర్నర్ పదవి గురించి కానీ తనకు ఎవరి నుంచి ఎలాంటి హామీలు లేవని చెప్పారు.

  • Loading...

More Telugu News