Vijayasai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి

Vijaya Sai Reddy resigns from Rajya Sabha

  • రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు రాజీనామా లేఖను సమర్పించిన విజయసాయిరెడ్డి
  • స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ అందజేత
  • మూడేళ్ల ముందుగానే రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి

వైసీపీ నేత విజయసాయిరెడ్డి శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఆయన రాజీనామా లేఖను సమర్పించారు.

తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి నిన్న ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ రోజు రాజ్యసభ చైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.

విజయసాయిరెడ్డిని 2016లో వైసీపీ రాజ్యసభకు పంపించింది. 2022లో వైసీపీ అధినేత జగన్ మరోసారి విజయసాయిరెడ్డికి రాజ్యసభ అవకాశం ఇచ్చారు. ఆయన పదవీ కాలం 2028 వరకు ఉంది. కానీ మూడేళ్ల ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News