Liquor Ban: మధ్యప్రదేశ్ లోని 17 ఆధ్యాత్మిక నగరాల్లో మద్యం షాపుల క్లోజ్

- కీలక నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
- ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్న నగరాల్లో మద్యం బంద్
- ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్న సీఎం మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్న 17 నగరాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్న నగరాల్లో మద్యం షాపులను పూర్తిగా మూసివేస్తున్నామని చెప్పారు.
ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని మద్యం దుకాణాలు బంద్ అవుతాయని సీఎం తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. మద్యం దుకాణాలు బంద్ కానున్న ఆధ్యాత్మిక నగరాల్లో ధటియా, లింగా, పన్నా, మాండ్లా, ముల్తాయి, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మండలేశ్వర్, చిత్రకూట్, కుండల్ పూర్, అమర్ కంటక్, ఓర్ఛా, మైహర్, బందక్ పూర్, బర్మన్ ఖర్ద్, మంద్ సౌర్, బర్మన్ కలా ఉన్నాయి.