HYDRA: మేడ్చల్‌లో రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రహరీ గోడ కూల్చివేసిన హైడ్రా

Hydra demolishes walls in Medchal

  • మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లిలో హైడ్రా కూల్చివేతలు
  • లేఔట్స్‌లో రహదారికి అడ్డుగా ఉన్న ప్రహరీ గోడలను కూల్చివేసిన హైడ్రా
  • సర్వే చేయించి అక్రమమని తేల్చిన హైడ్రా కమిషనర్

హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈరోజు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యనగర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడ లేఔట్స్‌లో రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడలను హైడ్రా కూల్చివేసింది.

స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడి లేఔట్లను పరిశీలించారు. అక్రమ నిర్మాణాలపై ఆరా తీశారు. ఆ తర్వాత అధికారులతో సర్వే చేయించారు. ప్రభుత్వ స్థలంలోనే ప్రహరీ గోడను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈరోజు కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల గోడను అధికారులు కూల్చివేశారు. 

  • Loading...

More Telugu News