India: పాకిస్థాన్ జైల్లో ప్రాణాలు కోల్పోయిన భారత మత్స్యకారుడు

- ఓ కేసులో కరాచీ జైల్లో శిక్షను అనుభవించిన మత్స్యకారుడు
- శిక్షా కాలం పూర్తయినప్పటికీ విడుదలలో జాప్యం
- మత్స్యకారుడి మృతిపై భారత్‌కు సమాచారం
పాకిస్థాన్ జైల్లో ఓ భారత మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. వాస్తవానికి అతని శిక్షాకాలం పూర్తయింది. కానీ విడుదలలో జాప్యం కారణంగా పాక్ జైల్లోనే కన్నుమూశాడు. దాయాది పాకిస్థాన్ కస్టడీలో భారత మత్స్యకారుడు మృతి చెందడం గత రెండేళ్లలో ఇది ఎనిమిదోసారి.
భారత మత్స్యకారుడు బాబును 2022లో పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి అతను కరాచీలోని జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. అతనిని అరెస్ట్ చేసిన కేసులో బాబు శిక్షాకాలం ఇటీవలే పూర్తయింది. కానీ బాబును విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అతను జైల్లో ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే మృతిపై భారత్‌కు సమాచారం ఇచ్చారు.