Road Accident: బంజారాహిల్స్‌లో ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి

- ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తి మృతి
- మరో ఇద్దరికి గాయాలు... ఆసుపత్రికి తరలింపు
- కారును అక్కడే వదిలేసి పారిపోయిన నిందితులు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక కారును అక్కడే వదిలేసి పారిపోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కారు ఎవరిది? ప్రమాదం ఎలా జరిగింది? పరారైన నిందితులు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.