Vijayasai Reddy: ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదే.. టీడీపీ ఏపీ చీఫ్ పల్లా

AP TDP chief Palla Srinivasa Rao responds on Vijayasai Reddy announcement

  • విజయసాయి ప్రకటన వైసీపీ దివాలాకోరుతనానికి నిదర్శనమన్న పల్లా శ్రీనివాసరావు 
  • రాజీనామాతో ఆయన చేసిన ఆర్థిక నేరాలు పోతాయనుకోవడం పొరపాటన్న పల్లా
  • రాజకీయ నేతలకు ఇదొక గుణపాఠం కావాలని హెచ్చరిక

విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రను దోచుకున్నారని, ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదేనని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విజయసాయి ప్రకటన వైసీపీ దివాలాకోరుతనానికి నిదర్శనమని పల్లా విమర్శించారు. ప్రజా సంక్షేమానికి పాటుపడలేని వారు రాజకీయాలకు స్వస్తి చెప్పడమే మంచిదని పేర్కొన్నారు. రాజీనామాతో ఆయన చేసిన ఆర్థిక నేరాలు పోతాయనుకోవడం పొరపాటని, రాజకీయ నేతలకు ఇదొక గుణపాఠం కావాలని ఆయన హెచ్చరించారు.

కాగా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయి నిన్న చేసిన ప్రకటన రాజకీయాల్లో పెను సంచలనమైంది. ఆ ప్రకటన ప్రకారం నేడు ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఇకపై తాను ఏ పార్టీలోనూ చేరబోనని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News