bollu ramesh: ప్రముఖ విద్యావేత్త బొల్లు రమేశ్ దారుణ హత్య

- ఈ నెల 18న కిడ్నాప్ కు గురైన బొల్లు రమేశ్
- వ్యాపారవేత్త అహ్మద్ ఖాద్రిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన రమేశ్ అర్ధాంగి
- పోలీసుల విచారణలో రమేశ్ ను హత్య చేసినట్లు అంగీకరించిన ఖాద్రి
కిడ్నాప్‌కు గురైన విద్యావేత్త బొల్లు రమేశ్ హత్యకు గురయ్యాడు. సికింద్రాబాద్ విక్రంపురిలో నివాసం ఉండే రమేశ్‌ను కాచిగూడలో దుండగులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న తన భర్త కనిపించడం లేదని రమేశ్ అర్ధాంగి కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సదరు ఫిర్యాదులో తన భర్త అదృశ్యం వెనుక బండ్లగూడకు చెందిన వ్యాపారవేత్త అహ్మద్ ఖాద్రి హస్తం ఉన్నట్లుగా అనుమానం ఉందని పేర్కొంది.
దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖాద్రిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఖాద్రి నేరాన్ని అంగీకరించాడు. రమేశ్‌ను హత్య చేసి ఖమ్మంజిల్లా కూసుమంచిలో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో ఖాద్రి వెల్లడించారు. దీంతో మిస్సింగ్ కేసును కిడ్నాప్, హత్య సెక్షన్ల కిందకు మార్చి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.