Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారడం ఖాయం: బీటెక్ రవి

- రాజకీయాలకు వీడ్కోలు పలికిన విజయసాయిరెడ్డి
- ట్విట్టర్ లో స్పందించిన బీటెక్ రవి
- జగన్ డిస్ క్వాలిఫై కావడం ఖాయమని వెల్లడి
- పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక తథ్యమని వ్యాఖ్యలు
వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం పట్ల టీడీపీ నేత బీటెక్ రవి స్పందించారు. రాజకీయాలకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని తెలిపారు. విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడడం ఖాయమని, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యమని పేర్కొన్నారు. ఈ మేరకు బీటెక్ రవి ట్వీట్ చేశారు.
ఇవాళ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో జగన్ తర్వాత అగ్రనేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి గల కారణాలను తలోరకంగా చర్చించుకుంటున్నారు. ఆయన ఏ పార్టీలో చేరబోవడంలేదని ప్రకటించడం కూడా ఆసక్తికరంగా మారింది.