Uttam Kumar Reddy: ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy responds on Banakacharla project

  • బనకచర్ల విషయంలో హరీశ్ రావు చేసిన ఆరోపణలు సరికాదన్న మంత్రి
  • బీఆర్ఎస్ హయాంలో నదీజలాల విషయంలో నష్టం జరిగిందన్న ఉత్తమ్ 
  • బీఆర్ఎస్ హయాంలో జరిగిన నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడి
  • బనకచర్లపై అభ్యంతరాలు తెలుపుతూ నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు అంశంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. బనకచర్ల విషయంలో తమ ప్రభుత్వంపై హరీశ్ రావు చేసిన ఆరోపణలు సరికాదన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో నదీ జలాల విషయంలో చాలా నష్టం జరిగిందన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక నష్టం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా పొరపాట్లు చేసిందని, వాటిని తాము సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏపీ నిర్మిస్తున్న బనకచర్లపై అభ్యంతరాలు తెలుపుతూ ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశామన్నారు. ఏపీ పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధమని, ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించవద్దని కేంద్రాన్ని కోరామన్నారు.

  • Loading...

More Telugu News