Vijayasai Reddy: ఇక నా భవిష్యత్తు వ్యవసాయం: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy said his future is agriculture

  • విజయసాయి సంచలన ట్వీట్
  • పాలిటిక్స్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటన
  • తాను ఏ పార్టీలోకి వెళ్లబోవడంలేదని స్పష్టీకరణ 

వైసీపీ సీనియర్ నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన విజయసాయిరెడ్డి తన ట్వీట్ తో హాట్ టాపిక్ గా మారారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆయన చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... విజయసాయిరెడ్డి పార్టీ కోసం గళం విప్పిన సందర్భాలు అతి తక్కువ అని చెప్పాలి. విజయసాయి జగన్ కు దూరం జరుగుతున్నారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అది ఇవాళ నిజం అయింది. 

కాగా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్న ప్రకటించిన విజయసాయి... తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇక తాను వ్యవసాయం చేసుకుంటూ బతుకుతానని వెల్లడించారు. "ఇక నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అని విజయసాయిరెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News