Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్ బై... విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన

- రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ విజయసాయి ట్వీట్
- రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
- ఏ పార్టీలో చేరడంలేదని స్పష్టీకరణ
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు (జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడంలేదని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని వివరించారు.