Raghurama Custodial Torture Case: రఘురామ చిత్రహింసల కేసు: నిందితుడు తులసిబాబుకు మూడ్రోజుల పోలీస్ కస్టడీ

Court imposes three day custody to Tulasi Babu in Raghurama Custodial Torture Case

  • గత ప్రభుత్వ హయాంలో రఘురామను చిత్రహింసలకు గురిచేసిన వైనం
  • రఘురామ ఛాతీపై కూర్చుని హింసించినట్టు తులసిబాబుపై ఆరోపణలు
  • ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబు

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గత ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు పాల్పడిన కేసులో నిందితుడు తులసిబాబుకు కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. తులసిబాబును మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఈ నెల 27 నుంచి 29 వరకు తులసిబాబును కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. రఘరామ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు ఏ6గా ఉన్నాడు. 

నాడు రఘురామను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని తమ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో తన ఛాతీపై కూర్చుని హింసించింది తులసిబాబేనని రఘురామ స్పష్టం చేశారు. దాంతో పోలీసులు తులసిబాబును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు డిస్ట్రిక్ట్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News