Stock Market: రోజంతా ఒడిదుడుకుల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు

- వారాన్ని నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు
- 329 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 113 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 329 పాయింట్లు నష్టపోయి 76,190కి పడిపోయింది. నిఫ్టీ 113 పాయింట్లు కోల్పోయి 23,092 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ ( 1.98%), టెక్ మహీంద్రా (0.75%), నెస్లే ఇండియా (0.70%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.58%), ఇన్ఫోసిస్ (0.56%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.92%), జొమాటో (-2.75%), టాటా మోటార్స్ (-2.48%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.11%), రిలయన్స్ (-1.42%).