Team India: చెన్నై చేరుకున్న టీమిండియా

Team India Arrive in Chennai

  • ఇంగ్లండ్‌తో రెండో టీ20 కోసం చెన్నై చేరుకున్న భార‌త జ‌ట్టు
  • చెన్నై విమానాశ్ర‌యంలో టీమిండియాకు ఘ‌న స్వాగతం
  • రేపు చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్

ఇంగ్లండ్‌తో రెండో టీ20 కోసం టీమిండియా చెన్నై చేరుకుంది. అక్క‌డి విమానాశ్ర‌యంలో టీఎన్‌సీఏ అధికారులు, అభిమానులు ఆట‌గాళ్ల‌కు ఘ‌న‌స్వాగతం ప‌లికారు. అక్క‌డి నుంచి భార‌త జ‌ట్టు నేరుగా హోట‌ల్‌కు చేరుకుంది. కాగా, రేపు చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 

ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధ‌వారం నాడు కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రిగిన తొలి టీ20లో టీమిండియా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం 1-0తో సూర్య‌కుమార్ సేన‌ ముందంజ‌లో ఉంది. కాగా, శ‌నివారం జ‌రిగే రెండో టీ20లో టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హమ్మ‌ద్ ష‌మీ రీఎంట్రీ ఇస్తాడ‌ని స‌మాచారం

More Telugu News