Gujarat: ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపులు .. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

- గుజరాత్ వడోధరలోని ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్
- విద్యార్ధుల తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం
- పాఠశాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ పోలీసులు
- ఈరోజు స్కూల్ కు సెలవు ప్రకటించిన యజమాన్యం
గుజరాత్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. వడోధరలోని ఓ ప్రైవేటు పాఠశాలకు ఈరోజు వేకువజామున బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం విద్యార్ధుల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ పాఠశాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పాఠశాల భవనం మొత్తం శానిటైజ్ చేశారు. ఇదే క్రమంలో పోలీసులు ఈమెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్ధుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నేడు పాఠశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.
ఈ అంశంపై వడోధర సీనియర్ పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడారు. గతంలో ఢిల్లీలో కూడా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయన్నారు. అయినప్పటికీ ఈ బెదిరింపులను తాము తేలిగ్గా తీసుకోలేదన్నారు. పాఠశాల మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఎటువంటి బాంబు లభించలేదన్నారు.