Revanth Reddy: ముగిసిన దావోస్ పర్యటన.. హైదరాబాద్‌లో రేవంత్‌కు ఘన స్వాగతం

దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. తొలుత సింగపూర్‌లో పర్యటించిన రేవంత్‌రెడ్డి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చున్నారు. అనంతరం అక్కడి నుంచి దావోస్ చేరుకుని ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎనమిక్ ఫోరం) సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించారు. ఆయన కృషి ఫలించడంతో రాష్ట్రానికి రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత పర్యటనలో రూ. 40,232 కోట్ల పెట్టుబడులు తీసుకురాగా, ఈసారి అంతకు నాలుగు రెట్ల పెట్టుబడులు సాధించారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో దాదాపు 50 వేలమంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. మొత్తం 20 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది.