Virender Sehwag: విడాకులు తీసుకోబోతున్న వీరేంద్ర సెహ్వాగ్

- 2004లో ఆర్తి అహ్లావత్ ను పెళ్లాడిన సెహ్వాగ్
- 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్న సెహ్వాగ్ దంపతులు
- కొంత కాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నట్టు సమాచారం
టీమిండియా మాజీ డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన భార్య ఆర్తి అహ్లావత్ తో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ఆయన ముగింపు పలుకుతున్నట్టు సమాచారం. వీరూ, ఆర్తి ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది.
2004 డిసెంబర్ లో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి వైవాహిక జీవితం 20 ఏళ్ల పాటు సజావుగానే సాగింది. కొన్ని నెలల క్రితం ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తాయని, కొంత కాలంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని సమాచారం. గత ఏడాది దీపావళి సందర్భంగా తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే, విడాకుల అంశంపై వీరూ కానీ, ఆర్తి కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ఇండియా తరపున సెహ్వాగ్ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 లలో ఆడాడు.