MCA: గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన ముంబయి వాంఖెడే స్టేడియం

- 14 వేల క్రికెట్ బంతులతో ప్రదర్శన ఇవ్వడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు
- వాంఖెడే స్టేడియంలో 50 ఏళ్ల వార్షికోత్సవ వేడుకలు
- మాజీ ప్లేయర్స్ స్మారకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్న ఎంసీఏ ప్రెసిడెంట్ అజింక్య నాయక్
ముంబయిలోని అతి పెద్ద వాంఖెడే స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం (జనవరి 23) అతి పెద్ద క్రికెట్ బాల్ సెంటన్స్‌తో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. స్టేడియంలో 14,505 బంతులతో .. ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం అని రాశారు. ఇందు కోసం ఎరుపు, తెలుపు బంతులను ఉపయోగించారు.
ఈ స్టేడియంలో 1975లో వెస్టిండీస్‌తో తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరిగింది. 1975 జనవరి 23 నుంచి 29 వరకు జరిగిన ఆ మ్యాచ్‌లో సోల్కర్ సెంచరీ నమోదు చేశాడు. 50 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా 14వేల బంతులతో ప్రదర్శన ఇవ్వడం జరిగిందని, మాజీ ప్లేయర్ ఏక్‌నాథ్ సోల్కర్ తో పాటు మాజీ ముంబయి ఆటగాళ్ల స్మారకంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంసీఏ ప్రెసిడెంట్ అజింక్య నాయక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ వేడుకలో ఉపయోగించిన 14వేల బంతులను స్కూళ్లు, క్లబ్ లు, ఎన్జీవోలకు చెందిన యువ క్రికెటర్లకు కానుకగా ఇవ్వనున్నట్లు ఎంసీఏ ప్రెసిడెంట్ తెలిపారు.