Adilabad District: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం... ఖోఖో ఆడుతూ తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి

- నార్నూర్ మండలం భీంపూర్ జెడ్పీ హైస్కూల్లో ఘటన
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్లో ఆటలపోటీలు
- విద్యార్థికి ఇదివరకు స్టెంట్ వేసినట్లుగా సమాచారం
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నార్నూర్ మండలం భీంపూర్ జెడ్పీ హైస్కూల్‌లో ఖోఖో ఆడుతూ తొమ్మిదో తరగతి విద్యార్థి బన్నీ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఆటలపోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఖోఖో ఆడుతుండగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బన్నీకి గతంలో గుండెపోటు రావడంతో స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. బన్నీ మృత్యువాత పడటంతో ఆ విద్యార్థి కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.