Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- 115 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 50 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 6.81 శాతం పెరిగిన అల్ట్రాటెక్ సిమెంట్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల మధ్య ఈ ఉదయం మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. అయితే, ఆటో, ఐటీ కంపెనీల షేర్ల మద్దతుతో మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 115 పాయింట్ల లాభంతో 76,520కి చేరుకుంది. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 23,205 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (6.81%), జొమాటో (2.52%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.03%), సన్ ఫార్మా (2.01%), టెక్ మహీంద్రా (1.86%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.19%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.18%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.06%), రిలయన్స్ (-1.05%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.97%).