Arvind Kejriwal: ఢిల్లీ యువతకు ఉపాధిపై హామీనిస్తూ కేజ్రీవాల్ వీడియో

- ఉద్యోగ, ఉపాధి కల్పించడమే తన లక్ష్యమన్న కేజ్రీవాల్
- నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఓ ప్రణాళికను రూపొందిస్తున్నామని వెల్లడి
- పంజాబ్‌లో 48 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడి
యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ బృందం ఓ ప్రణాళికను రూపొందిస్తుందన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఓ వీడియోను విడుదల చేశారు.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రెండేళ్లలో 48 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. మూడు లక్షలకు పైగా ప్రైవేటు రంగ ఉద్యోగాలను కల్పించామన్నారు. ఉపాధిని ఎలా సృష్టించాలో తమకు తెలుసన్నారు. ప్రజల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.