Uber: ఉబర్, ఓలా సంస్థలకు కేంద్రం నోటీసులు

Centre issues notice to Ola and Uber over alleged fare disparity on iPhone Android

  • ఉబర్, ఓలా సంస్థలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు
  • ఫోన్ ధరలను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు
  • వివరణ ఇవ్వాలంటూ కేంద్రం నోటీసులు

ఉబర్, ఓలా సంస్థలకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ సంస్థలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్రం స్పందించింది. ఈ తరహా యాప్‌లు ఫోన్ ధరను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఈ రెండు సంస్థలకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చింది.

అదే సమయంలో, ఒకే సర్వీసుకు ఈ రెండు సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ చర్యలకు ఉపక్రమించింది.

ఒకే సర్వీసుకు రెండు వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ధరల్లో వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ పేర్కొంది. ఛార్జీల విషయంలో నిజాయతీ, పారదర్శకత తీసుకువచ్చేందుకు సరైన వివరణతో రావాలని పేర్కొంది. 

ఉబర్ సంస్థ ఫోన్ ధరలను బట్టి మాత్రమే కాకుండా అందులోని బ్యాటరీ పర్సంటేజీ ఆధారంగా కూడా ఛార్జీలు వసూలు చేస్తోందని ఢిల్లీకి చెందిన రిషబ్ సింగ్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైజ్‌లతో బుకింగ్ ను పరిశీలించి ఈ ధరల తేడాను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News