Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను నిజంగానే కత్తితో పొడిచారా? అనే అనుమానం కలుగుతోంది: మహారాష్ట్ర మంత్రి

Attack real or was he just acting Maharashtra Minister on Saif Ali Khan attack

  • ముంబైకి వస్తున్న బంగ్లాదేశీయులు ఏం చేస్తున్నారో చూడాలన్న మంత్రి
  • ఇంతకుముందు రోడ్ల క్రాసింగ్‌పై నిల్చునే వారు... ఇప్పుడు ఇళ్లలోకి వస్తున్నారని వ్యాఖ్య
  • సైఫ్ అలీఖాన్‌ను తీసుకెళ్లడానికి వచ్చాడేమోనన్న నితీశ్ రాణే


బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను అసలు కత్తితో పొడిచారా? లేదా? అన్న అనుమానం కలుగుతోందని మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే అనుమానం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ... ముంబైకి వస్తున్న బంగ్లాదేశీయులు ఏం చేస్తున్నారో చూడండి... సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి కూడా ప్రవేశించారన్నారు. ఇంతకుముందు రోడ్ల క్రాసింగ్‌లపై నిల్చునేవారని, ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి చొచ్చుకొని వస్తున్నారన్నారు.

ఇంట్లోకి జొరబడిన బంగ్లాదేశ్ వ్యక్తి బహుశా సైఫ్ అలీఖాన్‌ను తీసుకువెళ్లడానికి వచ్చాడేమోనని ఎద్దేవా చేశారు. చెత్త‌ను ఏరివేయ‌డం మంచిదే అని వ్యాఖ్యానించారు. ఆసుపత్రి నుంచి అత‌ను (సైఫ్) వ‌చ్చిన‌ తీరు చూస్తే, అత‌న్ని పొడిచారా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఆసుపత్రి నుంచి నాట్యం చేసుకుంటూ వచ్చినట్లు ఉందని... బహుశా నటిస్తున్నాడేమో అని వ్యాఖ్యానించారు.

ఎన్సీపీ నేతలు జితేంద్ర అవ‌ద్, సుప్రియా సూలే వైఖ‌రిని మంత్రి నితీశ్ రాణే ఖండించారు. షారుక్ ఖాన్, సైఫ్ అలీఖాన్‌లకు ఏదైనా జ‌రిగితేనే వాళ్లు స్పందిస్తారని విమర్శించారు. ఖాన్‌ల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారని, సుశాంత్ రాజ్‌పుత్ వంటి హిందూ నటులను వేధిస్తే మాత్రం ఒక్కరూ ముందుకు వచ్చి మాట్లాడరని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News