సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు... వెంకటేశ్ స్పందన
- దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాల గురించి తనకు తెలియదన్న వెంకీ
- ఎవరెవరిపై రెయిడ్స్ జరుగుతున్నాయో తెలియదని వ్యాఖ్య
- తాను వైట్ మనీ తీసుకుంటానని వెల్లడి
- ఇతర హీరోల విషయం తనకు తెలియదని స్పష్టీకరణ
ఈ ఐటీ దాడులపై హీరో వెంకటేశ్ స్పందించారు. తమ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం తనకు తెలియదని చెప్పారు. ఎవరెవరిపై రెయిడ్స్ జరుగుతున్నాయో కూడా తనకు తెలియదని అన్నారు.
ఇక, తాను తీసుకునే పారితోషికం కూడా తక్కువని, అది కూడా వైట్ మనీయే తీసుకుంటానని వెల్లడించారు. తన రెమ్యునరేషన్ ఆఫీసుకు వెళుతుందని, అక్కడ్నించే తాను ఖర్చుల కోసం తీసుకుంటానని వెంకీ వివరించారు. ఇతర హీరోల విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు.