Anil Ravipudi: ఇండ‌స్ట్రీలో ఐటీ రైడ్స్‌పై ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఏమ‌న్నారంటే...!

Director Anil Ravipudi About IT Raids on Dil Raju and Others

  • మూడు రోజులుగా ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖుల ఇళ్ల‌పై ఐటీ దాడులు
  • 'సంక్రాంతికి వ‌స్తున్నాం' స‌క్సెస్‌మీట్‌లో ఈ విష‌యంపై స్పందించిన అనిల్ రావిపూడి 
  • ఐటీ దాడులు అనేవి ఒక ప్రాసెస్‌లో భాగ‌మేన‌న్న ద‌ర్శ‌కుడు 
  • ఇండ‌స్ట్రీ, బిజినెస్ వాళ్ల‌పై ఇలా జ‌ర‌గ‌డం స‌ర్వ‌సాధార‌ణమ‌ని వెల్ల‌డి

మూడు రోజులుగా ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖుల ఇళ్ల‌పై జరుగుతున్న ఐటీ దాడుల‌పై ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తాజాగా స్పందించారు. ఆయ‌న తాజా సినిమా 'సంక్రాంతికి వ‌స్తున్నాం' స‌క్సెస్‌మీట్‌లో ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న‌ ఐటీ రైడ్స్‌పై మాట్లాడారు. 

మీ నిర్మాత దిల్ రాజు ఐటీ దాడుల కార‌ణంగా బాధ‌లో ఉంటే... మీరు స‌క్సెస్ మీట్ చేసుకుంటున్నారా? అని స‌ర‌దాగా అడిగిన ప్ర‌శ్న‌కు అనిల్ రావిపూడి త‌న‌దైన‌శైలిలో స‌మాధానం ఇచ్చారు. 

"సంక్రాంతికి వ‌స్తున్నాం అని టైటిల్ పెట్టాం క‌దా... అందుకే వాళ్లు కూడా సంక్రాంతికే రావాల‌ని ఫిక్స్ అయ్యారేమో. ఇక దిల్ రాజు బాధ‌లో లేరు. ఆయ‌న ఒక్క‌డిపైనే ఐటీ దాడులు జ‌ర‌గ‌డం లేదు. ఇండ‌స్ట్రీలోని చాలా మందిపై ఐటీ రైడ్స్ జ‌రుగుతున్నాయి. తాను వ‌చ్చినా రాక‌పోయినా... ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌ను ఆపొద్ద‌ని దిల్ రాజు మాతో చెప్పారు. 

ఈ విజ‌యాన్ని మ‌మ్మ‌ల్ని ప్రేక్ష‌కుల‌తో పంచుకోవాల‌ని సూచించారు. అందుకే ఈ మూవీ విజ‌యాన్ని పంచుకోవ‌డానికి మీ ముందుకు వ‌చ్చాం. ఇక‌ ఐటీ దాడులు అనేవి ఒక ప్రాసెస్‌లో భాగ‌మే. ప్ర‌తి రెండు, మూడేళ్ల‌కు ఒక‌సారి ఇలా జ‌రుగుతూనే ఉంటాయి. ఇండ‌స్ట్రీ, బిజినెస్ వాళ్ల‌పై ఇలా జ‌ర‌గ‌డం స‌ర్వ‌సాధార‌ణం" అని అనిల్ రావిపూడి చెప్పారు. 

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ రైడ్స్ జ‌రుగుతున్నాయి.. మీ ఇంట్లో కూడా జ‌రిగే అవ‌కాశం ఉందా? అని విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు... "నేను సుకుమార్ ఇంటి ప‌క్క‌న లేను. ఫిబ్ర‌వ‌రిలో వాళ్ల ఇంటి ప‌క్క‌కు షిఫ్ట్ అవుతాను. ఇప్పుడు మీరు అన్నారు కాబ‌ట్టి... ఐటీ వాళ్లు మా ఇంటికి కూడా వ‌స్తారేమో" అని అనిల్ రావిపూడి చ‌మ‌త్క‌రించారు. 

కాగా, సంక్రాంతి పండ‌క్కి వ‌చ్చిన 'సంక్రాంతికి వ‌స్తున్నాం' మూవీ సూప‌ర్ హిట్ టాక్‌తో భారీ వ‌సూళ్లు రాబ‌డుతున్న విష‌యం తెలిసిందే. క‌లెక్ష‌న్ల ప‌రంగా ఇప్ప‌టికే ప‌లు నాన్ పాన్ఇండియా సినిమాల‌ రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ కావ‌డంతో పాటు... 'సంక్రాంతికి వ‌స్తున్నాం' సినిమాకు ఈ పండ‌క్కి బాగా క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. మ‌రోసారి అనిల్ రావిపూడి త‌న మునుప‌టి చిత్రాల మాదిరిగానే ఇందులోనూ త‌న‌దైన‌శైలిలో కామెడీ ట్రాక్‌ల‌ను జోడించి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. దాంతో జ‌నాలు ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.  

  • Loading...

More Telugu News