Nara Lokesh: లోకేశ్‌కు తల్లి భువనేశ్వరి, అర్ధాంగి బ్రాహ్మణి పుట్టినరోజు శుభాకాంక్షలు

- నేడు మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు
- ఈ ఏడాది కూడా విజయం, అంతులేని ఆనందంతో నిండి ఉండాలని భువనేశ్వరి ట్వీట్
- 'హ్యాపీ బర్త్‌డే లవ్ ఆఫ్ మై లైఫ్' అంటూ బ్రాహ్మణి పోస్ట్
ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోస్టులు పెట్టారు.
"పుట్టినరోజు శుభాకాంక్షలు నారా లోకేశ్. మన రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు పెట్టుబడుల కోసం దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొంటున్న నీకు నా ఆశీస్సులు ఉంటాయి. ఈ ఏడాది కూడా నీకు విజయం, అంతులేని ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నానా!" అని భువనేశ్వరి ట్వీట్ చేశారు.
"నాపై మీ ప్రేమ, అంకితభావానికి కృతజ్ఞురాలిని. మీరు చేసే ప్రతి పనికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఈ రోజు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు. ఈ సంవత్సరం కూడా మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే లవ్ ఆఫ్ మై లైఫ్" అని బ్రాహ్మణి పోస్ట్ చేశారు.