TGSRTC: ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రచారంపై స్పందించిన టీజీఎస్ఆర్టీసీ

TGSRTC on RTC privatization

  • డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన టీజీఎస్ఆర్టీసీ
  • డిపోలన్నీ ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటాయన్న టీజీఎస్ఆర్టీసీ
  • బస్సుల మెయింటెనెన్స్, ఛార్జింగ్ మాత్రమే బస్సుల కంపెనీల ఆధ్వర్యంలో ఉంటాయన్న టీజీఎస్ఆర్టీసీ

తెలంగాణలో ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరణ చేస్తారంటూ ప్రచారం సాగుతోందని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించింది. రాష్ట్రంలోని డిపోల కార్యకలాపాలు అన్నీ ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటాయని వెల్లడించింది.

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పేరిట ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ స్పందించింది.

ఎలక్ట్రికల్ బస్సుల మెయింటెనెన్స్, ఛార్జింగ్ మాత్రమే ఆయా బస్సుల కంపెనీలు నిర్వహిస్తాయన్నారు. మిగిలిన అన్ని కార్యకలాపాలు ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ పాలసీని అనుసరించి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామన్నారు.

  • Loading...

More Telugu News