Shamshabad Air Port: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు

- జనవరి 26న గణతంత్ర దినోత్సవం
- ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్
- జనవరి 30 వరకు విమానాశ్రయానికి సందర్శకులు రావొద్దని ఆదేశాలు
శంషాబాద్ విమానాశ్రయానికి నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్ ప్రకటించాయి. దీంతో విమానాశ్రయంలో నిఘా పెంచారు. జనవరి 30వ తేదీ వరకు విమానాశ్రయానికి సందర్శకులు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో విమానాశ్రయానికి మరింత భద్రతను పెంచి గట్టి నిఘా ఏర్పాటు చేశారు.