Train Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు...12 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జలగావ్ జిల్లాలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో 12 మంది మృతి చెందారు.
పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయన్న వదంతులతో ప్రయాణికులు భయాందోళనలకు గురై చైన్ లాగి కిందికి దిగారు. భయంతో పట్టాలు దాటుతున్న ఆ ప్రయాణికులను మరో ట్రాక్ వేగంగా దూసుకొచ్చిన కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించి, ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతను బట్టి మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.