TG High Court: తెలంగాణ హైకోర్టుకు నలుగురు అడిషనల్ జడ్జిలు

Four additional judges for Telangana High Court

  • నలుగురు అదనపు జడ్జిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ
  • జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ రేణుక, జస్టిస్ నర్సింగ్ రావు, జస్టిస్ మధుసూదన్ నియామకం
  • నలుగురు శుక్రవారం బాధ్యతలు తీసుకునే అవకాశం

తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ తిరుమల దేవి వచ్చే ఏడాది జూన్ 1 వరకు, జస్టిస్ రేణుక యార, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జస్టిస్ మధుసూదన్ రావు హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా రెండేళ్ల పాటు కొనసాగుతారని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

వీరు నలుగురు శుక్రవారం బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సుజోయ్ పాల్ నియమితులైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News