Amaravati: అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు... నిధుల విడుదలకు హడ్కో ఆమోదం

HUDCO gives nod to release Rs 11000 crore funds to Amaravati construction

  • ఊపందుకోనున్న ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం
  • రూ.11 వేల కోట్ల రుణానికి హడ్కో ఆమోదం
  • హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ

ఏపీ రాజధాని అమరావతికి హడ్కో శుభవార్త చెప్పింది. అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల నిధుల విడుదలకు హడ్కో అంగీకారం తెలిపింది. దీనిపై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించారు. అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల నిధుల కోసం హడ్కోతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. 

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో గతంలోనే రూ.11 వేల కోట్లు కేటాయించింది. దీనిపై గతేడాది అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు. 

ఈ నేపథ్యంలో, తాజాగా ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించింది.

  • Loading...

More Telugu News