Hanumakonda: అంద‌రూ చూస్తుండ‌గా పొడిచేశాడు... హ‌నుమ‌కొండ‌లో న‌డిరోడ్డుపై ఆటోడ్రైవ‌ర్ హ‌త్య‌!

Auto Driver Murder in Hanumakonda

   


హనుమకొండలో దారుణం జరిగింది. అదాల‌త్ సెంట‌ర్ వ‌ద్ద‌ పట్టపగలే ఆటోడ్రైవర్‌ను మరో ఆటో డ్రైవర్ అంద‌రూ చూస్తుండ‌గా క‌త్తితో పొడిచి చంపేశాడు. సుబేదారి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని డీమార్ట్ ఎదురుగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 

ఆటోడ్రైవ‌ర్లు మాచర్ల రాజ్ కుమార్‌, వెంక‌టేశ్వ‌ర్లు క‌త్తుల‌తో దాడి చేసుకున్నారు. వీరిలో రాజ్‌కుమార్ చ‌నిపోయాడు. మృతుడిది మడికొండ అని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఈ హ‌త్య‌కు గ‌త కార‌ణాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

అయితే, ఈ హ‌త్య‌కు ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణం కావొచ్చ‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రస్తుతం దాడి చేసిన వెంక‌టేశ్వ‌ర్లును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


More Telugu News