RG Kar Incident: ఆర్జీ కర్ హత్యాచార కేసు: కలకత్తా హైకోర్టులో విచారణ వాయిదా

- ఆర్జీ కర్ హత్యాచార కేసులో దోషికి జీవితఖైదు
- మరణశిక్ష పడకపోవడం పట్ల బెంగాల్ ప్రభుత్వం అసంతృప్తి
- సీల్దా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
- సీబీఐ, మృతురాలి కుటుంబం, దోషి వాదనలు కూడా వినాల్సి ఉందన్న హైకోర్టు
ఆర్జీ కర్ హత్యాచార కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కి కోల్ కతాలోని సీల్దా కోర్టు జీవితఖైదు విధించడం తెలిసిందే. అయితే, అతడికి మరణశిక్ష విధించకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.
మమత సర్కారు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ప్రభుత్వ పిటిషన్ పై విచారణ కొనసాగించే ముందు పలువురి వాదనలు తెలుసుకోవాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తు సంస్థ సీబీఐ, మృతురాలి కుటుంబం, దోషి వాదనలు కూడా వింటామని తెలిపింది. అనంతరం, ఈ కేసు విచారణను జనవరి 27కి వాయిదా వేసింది.