HCL Tech: హైటెక్ సిటీలోని కొత్త క్యాంపస్‌ను ప్రారంభించాలని రేవంత్ రెడ్డిని కోరిన హెచ్‌సీఎల్ టెక్ సీఈవో

HCL Tech ceo meets CM Revanth Reddy

  • దావోస్‌లో రేవంత్ రెడ్డితో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో భేటీ 
  • హైటెక్ సిటీలో కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తోన్న హెచ్‌సీఎల్ టెక్
  • ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించాలని సీఎంను కోరిన గ్లోబల్ సీఈవో

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నిర్మిస్తోన్న తమ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ విజయ్ కుమార్ కోరారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎంతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు.

హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల్లో హెచ్‌సీఎల్ టెక్ క్యాంపస్‌ను నిర్వహస్తోంది. ఈ కొత్త క్యాంపస్ నిర్మాణంతో 5 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించాలని సీఎంను వారు కోరారు. తెలంగాణలో హెచ్‌సీఎల్ టెక్ సంస్థ తన సేవలను విస్తరించడాన్ని సీఎం స్వాగతించారు.

తెలంగాణలో 'కంట్రోల్ ఎస్' భారీ పెట్టుబడి

హైదరాబాద్‌లో రూ.10 వేల కోట్ల భారీ పెట్టుబడికి 'కంట్రోల్ ఎస్' ముందుకు వచ్చింది. 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదిరింది. దీంతో తెలంగాణలో 3,600 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశముంది. మంత్రి శ్రీధర్ బాబు, 'కంట్రోల్ ఎస్' సీఈవో శ్రీధర్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ డేటా సెంటర్ రాష్ట్రంలో మరో మైలురాయి కానుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News